
‘7/జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘యుగానికి ఒక్కడు’ సినిమాలతో తెలుగు, తమిళ భాషలలో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సెల్వ రాఘవన్. ఈ దర్శకుడి చివరి సినిమా ‘వర్ణ’ ఘోర పరాజయం చవిచూసింది. పలు ఇంటర్వ్యూలలో ‘వర్ణ’ తన డ్రీం ప్రాజెక్ట్ అని సెల్వ రాఘవన్ చెప్పారు. ‘వర్ణ’ పరాజయం తర్వాత తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. సుమారు ఏడాదికిపైగా విరామం తీసుకున్న సెల్వ రాఘవన్, తన కొత్త సినిమా వివరాలను ప్రకటించారు.
సెల్వ రాఘవన్ చెప్పిన కథకు తమిళ యువహీరో శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శింబు హీరోగా నటించబోయే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తారు. ఈసారి అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే కథతో సినిమా చేస్తున్నట్టు సెల్వ రాఘవన్ చెప్పారు.

