‘బాలయ్య’కి విలన్ గా మాజీ హీరోయిన్ !

‘బాలయ్య’కి విలన్ గా మాజీ హీరోయిన్ !

Published on Jul 30, 2019 2:41 PM IST

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లు సోనాల్ చౌహాన్ అండ్ వేదిక నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో నమితను తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నమిత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోందట. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది.

కాగా ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఆగస్టు 7 నుండి బ్యాంకాక్‌ లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో బాలయ్య – సోనాల్ చౌహాన్ మరియు వేధికల సాంగ్స్ ను షూట్ చేయనున్నారు. అయితే సోనాల్ చౌహన్ మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. గతంలో ఈమె బాలకృష్ణతో కలిసి ‘లెజెండ్, డిక్టేటర్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘డిక్టేటర్’ తర్వాత ఆమె చేస్తున్న తెలుగు చిత్రం కూడా ఇదే కావడం విశేషం. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు