రీ రిలీజ్ కి రెడీ అయిన “సింహాద్రి”

రీ రిలీజ్ కి రెడీ అయిన “సింహాద్రి”

Published on Feb 21, 2024 3:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సింహాద్రి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మరోసారి థియేటర్ల లోకి రానుంది. ఈ చిత్రం ను మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

VMC ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం లో భూమిక చావ్లా, అంకిత, నాజర్, ముఖేష్ రుషి లు కీలక పాత్రల్లో నటించారు. విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కథను అందించగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ చిత్రం రీ రిలీజ్ కి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు