సూపర్ స్టార్ తో నేనా..? నమ్మలేకపోతున్నా !

సూపర్ స్టార్ తో నేనా..? నమ్మలేకపోతున్నా !

Published on Nov 14, 2018 2:22 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెట్టా’. ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్‌ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సిమ్రాన్‌ ఈ సినిమాతోనే తొలిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ సరసన నటిస్తోంది.

కాగా తాజాగా సిమ్రాన్‌ రజనీకాంత్‌ తో ఉన్న తన పోస్టర్‌ ను ట్వీటర్ లో పోస్ట్ చేస్తూ.. ‘నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. నన్ను నేనే గిచ్చుకొని చూసుకుంటున్నా’ అని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్, విజయ్ సేతుపతి, త్రిష, నవాజుద్దిన్ సిద్దిఖీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు