హిందీ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధధూన్’ను తెలుగుతో పాటు తమిళంలో కూడా రీమేక్ కానుంది. తెలుగులో నితిన్ లీడ్ రోల్ చేస్తుంటే తమిళంలో ప్రశాంత్ కథానాయకుడిగా నటించనున్నారు. హిందీలో టబు చేసిన నెగెటివ్ పాత్రను తెలుగులో తమన్నా చేయనుండగా తమిళంలో చేయడానికి మొదట బాలీవుడ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ అయితే బాగుంటుందని అనుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే తాజా సమాచారం ప్రకారం వారు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రన్ ను సంప్రదించారట.
సిమ్రన్ సైతం మంచి కథ, ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. గతంలో ప్రశాంత్, సిమ్రన్ కలిసి పలు హిట్ సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని ఫెడ్రిక్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత తియగరాజన్ స్వయాన ప్రశాంత్ తండ్రి. ఈమధ్య హీరోగా సినిమాలు చేయడం ఆపేసిన ప్రశాంత్ కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. మళ్లీ సోలోగా సినిమా చేసి నిలదొక్కుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ రీమేక్ చేస్తున్నారు.
