1996 నుండి నా దృష్టిలో ఉన్న కథ ‘మాయ’ – నీలకంఠ

1996 నుండి నా దృష్టిలో ఉన్న కథ ‘మాయ’ – నీలకంఠ

Published on Jul 19, 2014 9:42 AM IST

Neelakanta
జాతీయ అవార్డు గ్రహీత నీలకంఠ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాయ’. జరగబోయేది ముందే తెలిస్తే(ఎక్స్ ట్రా సెన్సరి పర్ సెప్షన్) ఎలా ఉంటుది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది. హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ. నందిని రాయ్ నటినటులుగా రూపొందిన ఈ చిత్రాన్ని ఎమ్.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలవుతుంది. ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు దర్శకుడు నీలకంఠ.

‘ గతంలో ఎక్స్ ట్రా సెన్సరి పర్ సెప్షన్ కాన్సెప్ట్ ఆధారంగా కొన్ని చిత్రాలు వచ్చాయి. నా సినిమా వాటన్నిటి కంటే భిన్నంగా ఉంటుంది. నా తీసుకున్న కథ కొత్తగా ఉంటుంది. చక్కని ఎమోషనల్ థ్రిల్లర్. స్ర్కీన్-ప్లే ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే కథ. 1996 నుండి ‘మాయ’ కథ నా దృష్టిలో ఉంది. ఈ కథను 1996లో రాసుకున్నా నేటి కాలానికి అనుగుణంగా అప్డేట్ చేసుకుంటూ వచ్చాను. హ్యుమన్ రిలేషన్స్, ఎమోషన్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది. మిసమ్మ చిత్రం తర్వాత.. నాకు అంత పేరు తీసుకొచ్చే చిత్రం అవుతుందని నమ్మకం ఉంది. మధుర శ్రీధర్ స్వతహాగా దర్శకుడు కావడం వలన నాకు పూర్తి స్వేఛ్చ ఇచ్చారు. కొన్నిసార్లు ఆయన సలహాలను పాటించాను. ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం తప్పకుండ విజయం సాదిస్తుంది.’ అని నీలకంఠ చెప్పారు.

తాజా వార్తలు