అవి గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను – చిన్మయి

అవి గుర్తొచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయాను – చిన్మయి

Published on May 18, 2026 12:06 PM IST

గాయనీగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా ‘చిన్మయి శ్రీపాద’ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే, తమిళ సినీ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని సింగర్ చిన్మయి తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ తర్వాత 2018లో దేశవ్యాప్తంగా సాగిన ‘మీటూ’ ఉద్యమం సమయంలో తమిళ డబ్బింగ్ యూనియన్ అధ్యక్షుడు రాధా రవిపై కూడా చిన్మయి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో, డబ్బింగ్ యూనియన్ చిన్మయి పై నిషేధం విధించింది.

2023లో ‘లియో’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ‘కరుప్పు’ సినిమాతో ఆమె మరోసారి త్రిషకు తన వాయిస్ అందించి అలరించింది. ఐతే, ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో తాను అనుభవించిన మానసిక సంఘర్షణ గురించి ఆమె చెబుతూ.. ఈ సినిమాకి స్టూడియోలో కొన్ని ఎమోషనల్ సీన్లకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. భవిష్యత్తులో ఎలాంటి ఆంక్షలు లేకుండా తన సొంత పరిశ్రమలో స్వేచ్ఛగా పనిచేసే రోజులు రావాలని కోరుకుంటున్నాను’ అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు