మహేష్ సినిమాలో సింగర్ సునీత?

మహేష్ సినిమాలో సింగర్ సునీత?

Published on Apr 20, 2015 2:53 PM IST

Singer-Sunitha-and-Mahesh-B
ఓపక్క సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటే.. మరోపక్క మహేష్ తరువాతి సినిమా ‘బ్రహ్మోత్సవం’ రోజుకో ఆసక్తికర కథనం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ఇంకా షూటింగ్ కూడా మొదలవ్వని ఈ సినిమా ఇప్పటికే వార్తల్లో నిలుస్తూ వస్తోంది. నిన్నటివరకూ మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అంటూ ఓ వార్త హల్‌చల్ చేయగా, రకుల్‌ప్రీత్ సింగ్ దాదాపుగా ఖాయమైనట్లు తెలుస్తోంది.

ఇక తాజాగా మరో ఆసక్తికర కథనం వినిపిస్తోంది. ప్రముఖ గాయని సునీత మహేష్ ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల సినిమాల్లో ఎన్నో మంచి పాటలు పాడిన సునీత, ఇప్పటివరకూ చాలా అవకాశాలు వచ్చినా సినిమాల్లో నటించలేదు. అయితే తాజాగా మహేష్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ప్రతిష్టాత్మక పీవీపీ సంస్థ నిర్మించనుంది.

తాజా వార్తలు