
‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ ‘సింగం 123’ టీజర్ డైలాగులతోనే కేక పుట్టించిన సినీ పరిశ్రమ కొత్త సెన్సేషన్ సంపూర్ణేష్ బాబు, త్వరలోనే ట్రైలర్ ద్వారా మరోసారి అలరించనున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ‘దొంగాట’ సినిమాతో పాటు థియేటర్లలో విడుదల చేయనున్నారు.
కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మంచు లక్ష్మి స్వయంగా నటించి, నిర్మించిన సినిమా ‘దొంగాట’ ఈనెల 8న విడుదల కానుంది. క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాను మంచు లక్ష్మి భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. ఇలాంటి కామెడీ సినిమాతో పాటే మరో కామెడీ సినిమా ట్రైలర్ విడుదల కావడం నిజంగా విశేషమే! అడవి శేష్ హీరోగా నటించిన ‘దొంగాట’ సినిమాను వంశీకృష్ణ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు.
టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి