2016 సంక్రాంతి కానుకగా సూర్య ‘సింగం 3’

2016 సంక్రాంతి కానుకగా సూర్య ‘సింగం 3’

Published on Feb 12, 2015 3:10 AM IST

singham-2
తమిళ స్టార్ హీరో సూర్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సినిమా ‘సింగం’. ఇప్పటికే రెండు పార్ట్స్ గా వచ్చిన సింగం, సింగం 2 సినిమాలు(తెలుగులో యముడు, సింగం 2) బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. అంతే కాకుండా తెలుగు అమరియు తమిళ్ లో సూర్య మార్కెట్ ని పెంచిన సినిమాలు ఇవి. కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి సీక్వెల్ గా మూడవ పార్ట్ రానుంది. ఇప్పటికే ఈ చిత్రాల డైరెక్టర్ హరి 3వ పార్ట్ కి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు.

డైరెక్టర్ హరి సూర్యకి కథ చెప్పడం ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. మొదరి రెండు సినిమాల్లోనూ హీరోయిన్ అయిన అనుష్కని కూడా హరి అప్రోచ్ అయ్యి కథ చెప్పారు. అనుష్క కూడా ఈ సీక్వెల్ లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చిత్ర టీం సింగం 3 సినిమా షూటింగ్ ని 2015 సెకండాఫ్ లో మొదలు పెట్టి 2016 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. సూర్య ప్రస్తుతం మాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటే అనుష్క బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో బిజీగా ఉంది.

తాజా వార్తలు