హీరోగా మరో సినిమా ఒప్పుకున్నా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు

హీరోగా మరో సినిమా ఒప్పుకున్నా సిరివెన్నెల సీతారామశాస్త్రి కుమారుడు

Published on Feb 14, 2013 3:30 PM IST

Sirivennela-son

ప్రశ్నలను కూడా తన పదజాలంతో పాటలుగా మార్చిన ఫేమస్ తెలుగు లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారమశాస్త్రి కుమారుడు శంకర్ చాలా గ్యాప్ తర్వాత మరో కొత్త సినిమాకి అంగీకారం తెలిపాడు. అతను కొన్ని సంవత్సరాల క్రితం తేజ దర్శకత్వంలో వచ్చిన ‘కేక’ సినిమాలో నటించాడు. ఆ సినిమా తర్వాత తను చేస్తున్న రెండవ సినిమా టైటిల్ ‘తెలుగు భాషలో నాకు నచ్చని పదం ప్రేమ’. ఈ సినిమాలో డైరెక్టర్ పి. వాసు కుమారుడు శక్తి వాసుదేవన్, పూర్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు ఉదయం ఈ సినిమా హైదరాబాద్లో లాంచనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలోని ముగ్గురి నటులపై తీసిన మొదటి సన్నివేశానికి వసుందరా దాస్ క్లాప్ నిచ్చారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి – పి. వాసు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆపిల్ బ్లోసం క్రియేషన్స్ ప్రై లిమిటెడ్ బ్యానర్ పై నారాయణ బాబు – పూర్ణిమ నారాయణ్ – వాసన్ ఎస్.ఎస్ నిమిస్తున్న ఈ సినిమాకి రాఘవ డైరెక్టర్. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి పి.హెచ్.కె దాస్ కెమెరామెన్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు