యూఎస్ లో స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకెళ్తున్న “సీతా రామం”.!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా రష్మికా మందన్న ఒక కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “సీతా రామం”. దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సినీ వర్గాల్లో మ్యాజిక్ ని క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ పట్ల కొన్ని డౌట్స్ ఉన్నాయి కానీ వాటిని మాత్రం ఈ చిత్రం సునాయాసంగా బ్రేక్ చేసేసింది అని చెప్పాలి. ముఖ్యంగా యూఎస్ మార్కెట్ లో అయితే ఈ సినిమాకి 7 లక్షల డాలర్స్ టార్గెట్ అని టాక్ రాగా ఇది సాధ్యం అవుతుందా అని కొందరు అనుకున్నారు.

కానీ ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే సగానికి పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ ని నమోదు చేసింది. ప్రీమియర్స్ మరియు రెండు రోజులు కలిపి ఈ చిత్రం లేటెస్ట్ గా 4 లక్షల డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసేసింది. దీనితో అయితే అందరు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా స్యూర్ షాట్ గా రీచ్ అయ్యిందని చెప్పి తీరాలి.

Exit mobile version