భారం మొత్తం కాజల్ మీదే !

Published on May 27, 2019 2:54 pm IST

గత శుక్రవారం విడుదలైన చిత్రాల్లో ‘సీత’ కూడా ఒకటి. మొదటిరోజు మిశ్రమ స్పందనతో రన్ మొదలుపెట్టిన ఈ చిత్రం మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.2 కోట్ల షేర్ వసూలు చేసింది. నిన్నటితో వీకెండ్ ముగియడంతో ఈరోజు నుండి సినిమా అసలు స్టామినా ఏమిటో తేలిపోనుంది. బాక్సాఫీస్ వద్ద ‘మహర్షి’ మినహా వేరే పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్రానికి కలిసొచ్చే అంశమే అయినా బలమైన టాక్ లేకపోవడం వసూళ్లను బలహీనపరిచే అవకాశం ఉంది.

మొదటి నుండి సినిమాను కాజల్ అగర్వాల్ క్రేజ్ మీదే మార్కెట్ చేశారు చిత్ర టీమ్. ప్రేక్షకులు సైతం కాజల్ కోసమే థియేటర్లకు క్యూ కట్టారు. సినిమాలో ఆమె నటనకు, పాత్రకు మంచి పేరే వచ్చింది. ఈ మూడు రోజులు ఆమె మూలంగానే మేజర్ బిజినెస్ జరిగింది. మరి ఈ వీక్ డేస్‌లో సైతం కాజల్ క్రేజ్, నటన వసూళ్లను నిలబెడతాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More