అనాథ పిల్లలకి “గుంటూరు కారం” స్పెషల్ స్క్రీనింగ్ వేయించిన మహేష్ కూతురు

అనాథ పిల్లలకి “గుంటూరు కారం” స్పెషల్ స్క్రీనింగ్ వేయించిన మహేష్ కూతురు

Published on Jan 21, 2024 1:00 PM IST

Sitara1

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “గుంటూరు కారం”. మరి భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లతో ఇప్పుడు దూసుకెళ్తుంది. ఇక ఈ చిత్రం విజయానికి సంబంధించి మేకర్స్ కూడా హ్యాపీ గానే ఉండగా గత కొన్ని రోజులు కితం ఈ చిత్రాన్ని మహేష్ కూతురు సితార ఘట్టమనేని కొందరు అనాథ పిల్లల కోసం అయితే స్పెషల్ స్క్రీనింగ్ వేయిస్తున్నట్టుగా పలు వార్తలు వచ్చాయి.

మరి ఈ వార్తను సితార నిజం చేస్తూ మహేష్ బాబు ఫౌండేషన్ మరియు చీర్స్ ఫౌండేషన్ కలయికలో నడపడుతున్న కొందరు పిల్లలకి అయితే హైదరాబాద్ ఏ ఎం బి సినిమాస్ లో గుంటూరు కారం స్పెషల్ షో ని సితార తన తరఫున వేయించింది. దీనితో ఈ సంబంధిత పిక్స్ వైరల్ గా మారగా ఆ పిల్లలతో సితార కలిసిన మూమెంట్ ఇపుడు మెమొరబుల్ గా మారింది. మరి మహేష్ తో పాటుగా తన వారసురాలు కూడా సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు