‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కోసం సితార.. ఏం చేసిందంటే..?

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ కోసం సితార.. ఏం చేసిందంటే..?

Published on Sep 24, 2026 11:19 PM IST

సూపర్‌స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా ఆమె ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ట్రెండ్‌లో భాగమై చేసిన ఒక క్యూట్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ చిన్నటి వీడియో ద్వారా చిత్రబృందానికి తన అపారమైన ప్రేమను, మద్దతును తెలపడంతో ఘట్టమనేని అభిమానులు, నెటిజన్లు సితార క్యూట్‌నెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, సారా పాలేకర్ ప్రధాన పాత్రల్లో శశాంక్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, ఎస్‌బి బై ఎస్‌ఎస్‌కే పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మించారు.

కాల భైరవ సంగీతం అందించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. సితార చేసిన ఈ స్పెషల్ ప్రమోషనల్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు