50 కోట్ల క్లబ్ లోకి “అయలాన్”

50 కోట్ల క్లబ్ లోకి “అయలాన్”

Published on Jan 16, 2024 8:22 PM IST

అనేక వాయిదాల తర్వాత, శివ కార్తికేయన్ యొక్క సైన్స్ ఫిక్షన్ చిత్రం అయలాన్ ఇటీవలే థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం స్లో నోట్‌ తో స్టార్ట్ అయినప్పటికీ, పొంగల్ సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు వెర్షన్ ఇంకా విడుదల కాలేదు. డబ్బింగ్ వెర్షన్ కూడా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా, స్క్రీన్‌లు లేకపోవడంతో వాయిదా పడింది.

అతి త్వరలో తెలుగులో విడుదల తేదీని ప్రకటిస్తారు మేకర్స్. ఆర్. రవి కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భాను ప్రియ, యోగి బాబు ఇతర కీలక పాత్రలు పోషించారు. KJR స్టూడియోస్‌లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను కోటపాడి జె రాజేష్ బ్యాంక్రోల్ చేసారు. ఈ VFX-భారీ చిత్రానికి AR రెహమాన్ సంగీత స్వరకర్త.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు