తన నెక్స్ట్ మూవీ కోసం శివ కార్తికేయన్ సూపర్ మేకోవర్!

తన నెక్స్ట్ మూవీ కోసం శివ కార్తికేయన్ సూపర్ మేకోవర్!

Published on Feb 12, 2024 9:25 PM IST

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ వరుస చిత్రాలు చేస్తూ ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటున్నారు. మంచి చిత్రాలు చేస్తూ యంగ్ హీరోల్లో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఈ హీరో తన 21 వ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. దర్శకుడు రాజ్‌ కుమార్ పెరియసామి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను ఫిబ్రవరి 16, 2024న సాయంత్రం 5 గంటలకు వెల్లడిస్తామని చిత్ర నిర్మాతలు తాజాగా ఒక వీడియో ద్వారా ప్రకటించారు.

అయితే మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో సూపర్ గా ఉంది. శివ కార్తికేయన్ సినిమా కోసం ఏ రేంజ్ లో మేకోవర్ అయ్యారు అనేది వీడియో ను చూస్తే తెలుస్తుంది. సోల్జర్ గా ఈ చిత్రం లో కనిపించనున్న శివ కార్తికేయన్ పవర్ ఫుల్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇది తన ఫ్యాన్స్ కి కచ్చితంగా ట్రీట్ అని చెప్పాలి. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు