‘సైజ్ జీరో’ సినిమా చూస్తే 1కేజీ బంగారం ఆఫర్

size-zero
భారీ బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్స్ అయిన ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలతో ఈ ఏడాది బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ హిట్స్ అందుకున్న యోగ బ్యూటీ అనుష్క నుంచి రానున్న మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘సైజ్ జీరో’. తమిళ స్టార్ ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాలోని లావు అమ్మాయి పాత్ర కోసం అనుష్క 20 కేజీల బరువు పెరిగి ఎంతో రిస్క్ తీస్కొని ఈ సినిమా చేసింది. పివిపి బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి నిర్మించిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికెట్ అందుకుంది. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుందని ఇదివరకే తెలియజేశాం.

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఈ చిత్ర టీం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయడానికి సరికొత్త వ్యూహరచన చేస్తున్నారని ఇది వరకే తెలిపాము. అందులో భాగంగానే ఈ చిత్ర టీం ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి 1కేజీ బంగారం గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ సినిమా టికెట్ తో పాటు మీకు ఓ పివిపి వోచర్ ఇస్తారు. ఆ వోచర్ పై ఉన్న 11 అంకెల కూపన్ కోడ్ ని 95454 66666 కి ఎస్ఎంఎస్ చేయండి లేదా www.pvpcinema.com లో రిజిష్టర్ అవ్వండి. అలా రిజిష్టర్ చేసుకున్న వారి నుంచి మూడు వారల తర్వాత 20 మంది లక్కీ విన్నర్స్ ని సెలక్ట్ చేస్తారు. ఆ 20 మందిని అనుష్కతో కల్పించి, అప్పుడు ఆ 20 మందిలో ఒకరిని లక్కీ డ్రా ద్వారా విన్నర్ గా సెలక్ట్ చేసి వారికి 1 కేజీ బంగారాన్ని అందజేస్తారు. పైరసీని అరికట్టడం కోసమే ఇలా సరికొత్త రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నామని నిర్మాత పివిపి తెలిపాడు. అలాగే ఫ్యామిలీతో కలిసి వచ్చి చూడాల్సిన సినిమా అని చెప్పారు.

ఇప్పటికే ట్రైలర్స్ ద్వారా పాజిటివ్ టాక్ ఉన్న ఈ సినిమాకి అందరిలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో స్టార్స్ అయిన నాగార్జున, రానా రాగ్గుబాటి, రంగం ఫేం జీవ, తమన్నా, కాజల్ అగర్వాల్, హన్సిక, లక్ష్మీ మంచు, శ్రీ దివ్య, రేవతిలు అతిధి పాత్రల్లో కనిపించి కనువిందు చేయనున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించాడు.

Exit mobile version