‘సైజ్ జీరో’ రిలీజ్ డేట్ ఖరారు

‘సైజ్ జీరో’ రిలీజ్ డేట్ ఖరారు

Published on Sep 26, 2015 12:14 PM IST

size-zero1
ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ‘సైజ్ జీరో’ పేరుతో ఓ సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో ప్రయోగాలు చేసి, హీరోయిన్‌గా సూపర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అనుష్క, సైజ్ జీరో సినిమా ద్వారా సాహసం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ మధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్ టీజర్‌తో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. కేవలం సైజ్ జీరో సినిమా కోసమే అనుష్క 30 కేజీలకు పైనే బరువు పెరగడం ఈ సినిమా విషయంలో ఆసక్తికరంగా కనిపిస్తోన్న అంశం.

ఇక ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను చివరిదశకు చేర్చిన ‘సైజ్ జీరో’ యూనిట్, సినిమాను అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు తేనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకూ సైజ్ జీరో సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టమైన క్లారిటీ లేకపోగా, తాజాగా సినిమా యూనిట్ అక్టోబర్ 9కి సినిమాను ఫిక్స్ చేసేసింది. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పీవీపీ సంస్థ నిర్మించింది. కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకటిగా నిలుస్తుందని సినిమా యూనిట్ చెబుతూ వస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు