సర్దార్ 2 : స్టైలిష్ విలన్ గా ఎస్.జే సూర్య ఎంట్రీ..!

వర్సటైల్ యాక్టర్ ఎస్‌జే సూర్య పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’ నుండి మేకర్స్ పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కార్తీ హీరోగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ స్పై థ్రిల్లర్‌లో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, బ్లూ సూట్ మరియు బ్యాక్‌గ్రౌండ్‌లో డ్రాగన్ ఎలిమెంట్‌తో స్టైలిష్‌గా ఉన్న ఆయన లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

​ఈ క్రేజీ సీక్వెల్‌ను పీఎస్ మిత్రన్ డైరెక్ట్ చేస్తుండగా, ఎస్. లక్ష్మణ్ కుమార్, ఈషాన్ సక్సేనా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజా విలన్ లుక్ రివీల్‌తో కార్తీ, ఎస్‌జే సూర్య మధ్య జరగబోయే మైండ్ బ్లోయింగ్ క్లాష్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

Exit mobile version