“స్కంద” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

“స్కంద” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!

Published on Jan 21, 2024 9:47 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రలో, మాస్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులని అలరించడంలో విఫలం అయ్యింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ ఈ సినిమా కి సంబందించిన శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

స్టార్ మా లో వచ్చే ఆదివారం సాయంత్రం 5:30 గంటలకి స్కంద ప్రసారం కానుంది. శ్రీ లీల, సాయి మంజ్రేకర్ లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు