‘స్కంద’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

‘స్కంద’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్

Published on Jan 16, 2024 3:02 AM IST

యువ నటుడు రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ స్కంద. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించగా ఎస్ థమన్ సంగీతం అందించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో దగ్గుబాటి రాజా, శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, ప్రిన్స్, గౌతమి, ఇంద్రజ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి యావరేజ్ విజయం అందుకున్న స్కంద మూవీ కొన్నాళ్ల క్రితం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైంది. దీనిని జనవరి 21న ప్రముఖ టెలివిజన్ ఛానెల్ స్టార్ మా వారు సాయంత్రం 5 గం. 30 ని. లకు ప్రసారం చేయనున్నారు. మరి స్కంద మూవీ బుల్లితెర ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు