కలెక్షన్స్ కాదు క్రెడిబిలిటీ ముఖ్యం – నిర్మాత ఎస్‌కేఎన్

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో సాధించిన విజయం ఒక అద్భుతమని, కేవలం నాలుగు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బడ్జెట్ రికవరీ సాధించి అంచనాలను మించిపోయిందని నిర్మాత SKN అన్నారు. చెన్నై లవ్ స్టోరీ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన మొదటి బాధ్యత అని, టీవీ ఛానెల్‌లో రూ.2,500 జీతంతో మొదలైన తన ప్రయాణంలో లాభాల కంటే ప్యాషన్‌కే ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు.

ఈ విజయంలో హీరో కిరణ్ అబ్బవరం సిన్సియారిటీ, నటి శ్రీ గౌరి ప్రియా నటనను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. అలాగే, హౌస్‌ఫుల్ టాక్ వస్తున్నా విజయాన్ని నమ్మలేకపోయిన దర్శకుడు సాయి రాజేష్ సరదా క్షణాలను పంచుకున్నారు.

సినిమా సక్సెస్‌లో భాగమైన మైత్రి నవీన్‌కు మరియు మద్దతుగా నిలిచిన నాగచైతన్యకు కృతజ్ఞతలు తెలిపిన SKN, భవిష్యత్తులో చైతన్యతో కలిసి ఒక మంచి లవ్ స్టోరీ నిర్మించాలని ఉందన్నారు.

Exit mobile version