మంచి సినిమాలకు ఆకాశమే హద్దు – మహేష్ బాబు

MAHESH-BABU-(44)
టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘శ్రీమంతుడు’. ఈ సినిమా హిట్ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నాడు. మహేష్ అతో పాటు ఆయన అభిమానులు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ సినిమాకి అభిమానుల నుంచే కాక, విమర్శకుల నుంచి, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంశలు వచ్చాయి. ప్రశంశలతో పాటు శ్రీమంతుడు బాక్స్ ఆఫీసు వద్ద కూడా సూపర్ హిట్ కలెక్షన్స్ నమోదు చేస్తుంది. శ్రీమంతుడు సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు స్పెషల్ థాంక్స్ తెలియజేయడం కోసం మహేష్ బాబు ఈ రోజు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.

ఈ సక్సెస్ మీట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ‘ శ్రీమంతుడు సక్సెస్ విషయంలో నేను చాలా చాలా హ్యాపీ, ఆ సినిమాకి వచ్చిన కామెంట్స్ గురించి మాటల్లో చెప్పలేను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే మంచి సినిమాలకు ఆకాశమే హద్దని మరోసారి నిరూపించిందని’ తెలిపాడు. మహేష్ బాబు కలెక్షన్స్ విషయంలో కూడా డబుల్ హ్యాపీగా ఉన్నాడు. మహేష్ బాబు – శృతి హాసన్ జంటగా నటించిన ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version