గత నెల నవంబర్ లో టాలీవుడ్ నుంచి పెద్ద హెఒల సినిమాలేవీ రాలేదు. దాంతో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్, చిన్న హీరోల సినిమాలు వరుసగా పోటీపడి మరీ రిలీజ్ అయ్యాయి. కట్ చేస్తే ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీసు వద్ద పెద్దగా మెప్పించలేకపోయింది. వచ్చిన సినిమాలన్నీ వచ్చిన దారిలోనే ఫ్లాప్స్ బాటలో చేరిపోయాయి. ఇకపోతే గతవారం యమలీల 2, రఫ్, అలా ఎలా.?, డేగ మొదలైన సినిమాలు రిలీజ్ అయ్యాయి.
కానీ ఈ సినిమాలన్నిటిలోకి అలా ఎలా సినిమా మాత్రం బాగుందనే మౌత్ టాక్ తో బాక్స్ ఆఫీసు వద్ద కాస్త సందడి చేస్తోంది. రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్, శాని కలిసి నటించిన ఈ సినిమా ద్వారా అనిష్ కృష్ణ డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మౌత్ పబ్లిసిటీ బాగా రావడంతో మొదటి వారం మంచిగా కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. దాంతో ఈ చిత్ర నిర్మాతలు కూడా హ్యాపీగా ఉన్నారు.


