పెళ్ళైన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ తాజాగా ‘ఉలవచారు బిర్యాని’ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ కి మంచి పేరు రావడమే కాకుండా స్నేహ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో తన పెర్ఫార్మన్స్ బాగుంది అని చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పింది.
అలాగే తన భవిష్యత్ పరనాలికల గురించి చెబుతూ ‘నేను, నా భర్త కలిసి ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించాలనుకుంటున్నాం. దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు తెలియజేస్తాం. అలాగే నా భర్త ప్రసన్న నేను కలిసి ఓ సినిమా చేయాలనుకుంటున్నాం’ అని స్నేహ తెలిపింది.
అలాగే గ్లామరస్ పాత్రలు చేయనని, అలా చేస్తే తన సినిమాలను తన కుటుంబసభ్యులతో కూర్చొని చూడలేను అని తెలిపింది.


