“ఓజి” రిలీజ్ అటకెక్కినట్టేనా?

“ఓజి” రిలీజ్ అటకెక్కినట్టేనా?

Published on May 30, 2024 7:02 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. పవన్ పొలిటికల్ గా సహా సినిమా పరంగా ఓ రేంజ్ కిక్ ఈ ఏడాదిలో ఇస్తాడని అంతా ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాల్లో థాని హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ చిత్రం “ఓజి” కోసం అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా తను చేసిన కామెంట్స్ మాంచి వైరల్ అయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ భారీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కొన్ని అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇవి మరింత బలపడ్డాయి. ఈ సినిమా డేట్ సెప్టెంబర్ 27 కోసం ఆల్రెడీ తారక్, ఎన్టీఆర్ లు చూస్తున్నారని బజ్ ఉండగా ఈ డేట్ ని ఆల్రెడీ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ తో లాక్ చేసుకున్నాడు.

మరి ఈ సినిమా నిర్మాతలు నాగ వంశీ, త్రివిక్రమ్ లు పవన్ కి ఎంత సన్నిహితులు అనేది అందరికి తెలుసు. సో వారికి తెలియకుండా పవన్ డేట్ ని లాక్ చేయరు. ఇలా ఓజి సినిమా ఆ డేట్ కి రాదు అని తెలిసే ఈ సినిమాని అనౌన్స్ చేసి ఉండొచ్చు. దీనితో ఓజి రిలీజ్ ప్రస్తుతానికి వాయిదా పడినట్టే అనుకోవాలి. మరి డివివి దానయ్య నుంచి ఎలాంటి క్లారిటీ అయినా వస్తుందేమో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు