స్టార్ హీరో ఫ్యాన్స్ పిచ్చ పరాకాష్టకు చేరిందిగా…!

స్టార్ హీరో ఫ్యాన్స్ పిచ్చ పరాకాష్టకు చేరిందిగా…!

Published on Jul 30, 2019 7:13 AM IST

స్టార్ హీరోల అభిమానులు ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులు చేసుకోవడం సాధారణంగా జరిగే విషయమే. సామాజిక మాధ్యమాల ప్రభావం ఎక్కువైన తరువాత ఈ అభిమానం అనే వెర్రితనం కొత్త పుంతలు తొక్కుతుంది. హీరోలను దేవుళ్లుగా పూజించే తమిళులలో ఈ పైథ్యం ఎక్కువై హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.

ఇందుకు తార్కాణమే తాజా ఘటన.తమిళ పరిశ్రమలో స్టార్ హీరోలైన విజయ్, అజిత్ అభిమానుల మధ్య తరచుగా వివాదాలు నడుస్తూ ఉంటాయి. ఈ హీరోలిద్దరి అభిమానులు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటూ ఉంటారు.ఐతే అజిత్ అభిమానులు ఏకంగా ఒక అడుగు ముందుకేసి యాక్టర్ విజయ్ మరణించారంటూ ప్రచారం చేస్తున్నారు. రిప్ యాక్టర్ విజయ్ అనే యాష్ టాగ్ తో ఆ న్యూస్ ని సోషల్ మాధ్యమాలలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

అజిత్ ఫ్యాన్స్ చేస్తున్న ఈ పనికి సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. క్రికెటర్ రవిచంద్రన్ అశ్విని కూడా, అనేక సమస్య లతో ఇబ్బంది పడుతున్న తమిళ ప్రజల గురించి కాకుండా, ఇలాంటి చెడ్డపనులు చేస్తున్నవారిపై అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు