తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన కామెడీ షో జబర్ధస్త్ తెలియనివారు బహుశా ఉండరేమో. అంతగా జబర్ధస్త్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఈ కామెడీ షోతో నటులుగా పరిచయమైన చాలా మంది ఇప్పుడు సినిమాలలో కమెడియన్స్ గా, హీరోలుగా రాణిస్తున్నారు. జబర్ధస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటులలో సుధీర్ ఒకరు. సుడిగాలి సుధీర్ గా సుపరిచితుడైన సుధీర్ హీరోగా చేస్తున్న చిత్రం ‘సాఫ్ట్ వేర్ సుధీర్’.
కాగా నేడు ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కామెడీ యాక్షన్ మరియు డాన్స్ ఇలా సుధీర్ ఓ కమర్షియల్ హీరోకి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ చిత్రంలో ఇరగదీశాడని చిత్ర ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ మూవీలో కొంత సోసియో ఫాంటసీ యాంగిల్ కూడా ఉందనిపిస్తుంది. సుధీర్ కి హీరోయిన్ గా ధన్యా బాలకృష్ణ నటిస్తుండగా, పి.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


