“సాహో” హైటెక్ యాక్ష‌న్‌ డ్రామా అట !

Published on May 28, 2019 1:00 am IST

ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత స్థానంలో నిల‌బెట్టిన ‘బాహుబలి’ 1, 2 చిత్రాల‌ తరువాత.. మళ్లీ ఆ స్థాయిలో రాబోతున్న సినిమా ‘సాహో. రెబెల్ స్టార్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన‌ ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లవుతుంది.

ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. జూన్ రెండో వారం నుండి ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నాడు. ఇక సాహో స‌బ్జ‌క్ట్ కి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో ఏక కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పైగా హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం.

మొత్తానికి హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయట.

సంబంధిత సమాచారం :

More