లోకేష్ కనగరాజ్ నుంచి సాలిడ్ అనౌన్సమెంట్.. కానీ ఏ సినిమా మీద?

లోకేష్ కనగరాజ్ నుంచి సాలిడ్ అనౌన్సమెంట్.. కానీ ఏ సినిమా మీద?

Published on Apr 13, 2024 2:01 PM IST

సౌత్ ఇండియా సినిమా దగ్గర తమ టాలెంట్ తో తక్కువ సినిమాలతోనే భారీ క్రేజ్ ని తెచ్చుకున్న దర్శకుల్లో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. మరి లాస్ట్ గా దళపతి విజయ్ తో “లియో” అనే సినిమా చేసి సెన్సేషనల్ హిట్ ని అందుకోగా ఆ సినిమాతో తన కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ ని తాను అందుకున్నాడు.

అయితే ఈ సినిమా తర్వాత మరిన్ని సాలిడ్ సినిమాలతో క్రేజీ లైనప్ ని తను సెట్ చేసుకున్నాడు. అయితే ఈ లిస్ట్ లో తలైవర్ రజినీకాంత్ తో ఓ సినిమా చేయనున్నాడు. మరి ఈ సినిమాపై టైటిల్ అనౌన్సమెంట్ ని ఈ ఏప్రిల్ 22న రిలీజ్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. కానీ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమాపై వినిపిస్తుంది.

రేపు ఏప్రిల్ 14న తన నెక్స్ట్ సినిమా టైటిల్ అనౌన్సమెంట్ కాబోతున్నట్టుగా తమిళ సినీ వర్గాలు ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. దీనితో ఆ సినిమా ఏంటి టైటిల్ ఏంటి అనేది అందరిలో ఆసక్తిగా మారింది. మరి లోకేష్ కనగరాజ్ దర్శకునిగా తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని అందిస్తాడా లేక నిర్మాతగా తన బ్యానర్ నుంచి నెక్స్ట్ సినిమా అప్డేట్ అందిస్తాడా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు