
అక్కినేని ఫ్యామిలీ మూడవతరం నట వారసుడు అఖిల్ అక్కినేని సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. కానీ ఈ సినిమా కోసం వస్తున్న బిజినెస్ ఆఫర్స్ మాత్రం టాలీవుడ్ ప్రముఖులను, ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేస్తున్నాయి. ఇటీవలే నైజాం రైట్స్ 13 కోట్లకి, కృష్ణా జిల్లా రైట్స్ 2.5కోట్లకి అమ్ముడు పోయాయని తెలియజేశాం. తాజా సమాచారం ప్రకారం సీడెడ్ లో కూడా ఓ భారీ బిజినెస్ ఆఫర్ వచ్చింది. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే దాని కన్నా ఎక్కువగా ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఆశిస్తుండడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.
ఇక విషయంలోకి వెళితే ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు అఖిల్ ఫస్ట్ మూవీ సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం 6 కోట్లు ఆఫర్ చేసారు కానీ ప్రొడక్షన్ టీం మాత్రం 7 కోట్లకి అమ్ముతామని ఆఫర్ ని హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ సినిమాలకి సీడెడ్ లో మంచి క్రేజ్ ఉండడమే ప్రొడక్షన్ టీం ఈ రేంజ్ డిమాండ్ చేస్తోంది. సుమారు 85% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ హీరోయిన్ గా పరిచయం కానుంది. నితిన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ – తమన్ కలిసి మ్యూజిక్ అందిస్తున్నారు.

