“కల్కి 2898 ఎడి” కి పెద్ద రన్ టైం లాక్!?

“కల్కి 2898 ఎడి” కి పెద్ద రన్ టైం లాక్!?

Published on May 30, 2024 8:00 AM IST


పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) ఇంకా అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలతో చేసిన మాసివ్ ఫీస్ట్ చిత్రమే “కల్కి 2898 ఎడి”. మరి మన ఇండియన్ సినిమా నుంచి చాలా కాలం తర్వాత ప్రైడ్ పాన్ వరల్డ్ సినిమాగా ఇది వస్తుండగా దీనికి ఇప్పుడు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకి వస్తున్నాయి. అలా ఇప్పుడు సినిమా భారీ రన్ టైం బయటకి వచ్చింది. ఈ చిత్రం ఏకంగా 3 గంటల రన్ టైం తో రాబోతున్నట్టుగా ఇప్పుడు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ తరహా సినిమాలు అన్నీ దాదాపు 3 గంటలు లేదా 3 గంటలు దాటే రన్ టైం తో వస్తున్నాయి.

ఇప్పుడు ఇదే కోవలో కల్కి కూడా సరిగ్గా 3 గంటల రన్ టైం తో రాబోతుందట. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఈ భారీ సినిమాలో దీపికా పదుకోణ్ (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) తదితరులు నటిస్తుండగా బుజ్జి (Bujji) కి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది అలాగే ఈ అవైటెడ్ చిత్రం ఈ జూన్ 27న గ్రాండ్ రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు