“మెగా 154” పై పెరుగుతున్న హైప్.!

“మెగా 154” పై పెరుగుతున్న హైప్.!

Published on Oct 22, 2022 7:28 AM IST

Chiranjeevi Mega 154

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా కె ఎస్ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ కోసం అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో 154వ సినిమాగా ఇది తెరకెక్కిస్తుండగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి నిన్ననే సాలిడ్ అప్డేట్ కూడా బయటకి రాగా సినిమా పై మాత్రం మరింత స్థాయిలో హైప్ పెరుగుతూ వెళ్తుంది అని చెప్పాలి.

చిరు నటించిన లాస్ట్ చిత్రం గాడ్ ఫాదర్ లో కొన్ని అంశాల్లో సబ్జెక్టు కి తగ్గట్టుగా కాంప్రమైజ్ కావాల్సి వచ్చింది. దీనితో చిరు నుంచి ఫుల్ మీల్స్ మిస్సయ్యాయి. కానీ ఈ మెగా 154 లో అయితే మిస్ కానట్టే తెలుస్తుంది. నిన్న ప్రీ లుక్ పోస్టర్ లో కూడా మెగాస్టార్ కొత్త అవతార్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అయితే సినిమా టైటిల్ మరియు టీజర్ వచ్చాక డెఫినెట్ గా మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతారు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు