సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తోన్న క్రేజీ కమర్షియల్ ఎంటర్ టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. కాగా ఈ సినిమా విడుదలకు ఇక కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున, మేకర్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ కర్నూలు నేపథ్యంలో సాగుతూ క్రేజీ మాస్ ఫైట్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్‌లతో ఉండబోతుందట. అనిల్ రావిపూడి తొలిసారిగా ఈ సినిమాలో మహేష్ కోసం అద్భుతమైన పవర్ ఫుల్ పాత్రను రూపొందించారట. ఓవరాల్ గా ఇంటర్వెల్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ నిలుస్తోందని తెలుస్తోంది.
కాగా రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్‌టైనర్ లో మహేశ్ బాబు సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి కూడా ఈ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


