యూఎస్ ప్రీ సేల్స్ లో అదరగొడుతున్న “టిల్లు” గాడు..

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించింది. అయితే ఈ చిత్రం డీజే టిల్లు కి సీక్వెల్ గా వస్తుండగా దానికి డబుల్ ఎంటర్టైన్మెంట్ ని జోడించి మేకర్స్ తీసుకొస్తున్నట్టుగా తెలుపుతున్నారు.

ఇక ఈ చిత్రం యూఎస్ లో కూడా సాలిడ్ బుకింగ్స్ రిజిస్టర్ చేస్తుంది. మరి లేటెస్ట్ గా అయితే ఈ సినిమా జస్ట్ ప్రీ సేల్స్ లోనే 2 లక్షల డాలర్స్ కి పైగా రాబట్టేయడం విశేషం. దీనితో ఈ చిత్రం పట్ల యూఎస్ ఆడియెన్స్ మంచి ఆసక్తిగానే ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. మరి టోటల్ ప్రీమియర్ నంబర్స్ ఎంత వరకు వెళ్తాయో చూడాలి.

గతంలో మొదటి పార్ట్ కి యూఎస్ లో భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. మరి ఈ చిత్రానికి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి రామ్ మిర్యాల, భీమ్స్ లు సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఈ మార్చ్ 29న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Exit mobile version