ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ కూడా ఒకటి.భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి వచ్చింది ఒకటీ రెండు పోస్టర్ లు మాత్రమే అయినా పాన్ ఇండియా లెవెల్లో మాస్ రీచ్ సొంతం చేసుకున్నాయి.
అయితే ఈ సినిమా విడుదల పట్ల కొత్త ఊహాగానాలు అయితే మొదలయ్యాయి కానీ సినిమా తాలూకా అవుట్ పుట్ విషయంలో సాలిడ్ రిపోర్ట్స్ తెలుస్తున్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన అవుట్ పుట్ అంతా మాత్రం ఎక్స్ట్రార్డినరీ గా వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే మేకర్స్ కూడా ఈ సినిమా ఎప్పుడు వచ్చినా సంచలనం సెట్ చేయడం గ్యారెంటీ అనే ధీమా డిస్ట్రిబ్యూటర్స్ లో కూడా నింపినట్టు టాక్.
సో ఫౌజీ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన పని లేదు అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ డిసెంబర్ 3న పాన్ ఇండియా లెవెల్లో విడుదలకి ప్లాన్ చేస్తున్నారు.


