నార్త్ లో “సలార్” టీవీ ప్రీమియర్ కి సిద్ధం.. సరైన టైం ఫిక్స్ చేసుకున్నారుగా

నార్త్ లో “సలార్” టీవీ ప్రీమియర్ కి సిద్ధం.. సరైన టైం ఫిక్స్ చేసుకున్నారుగా

Published on May 25, 2024 2:01 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యి ఓటిటి అలాగే సౌత్ స్మాల్ స్క్రీన్స్ పైకి కూడా వచ్చేసింది. ఇక ఫైనల్ గా ఇప్పుడు నార్త్ లో సలార్ స్మాల్ స్క్రీన్స్ ని హిట్ చేసేందుకు రాబోతుంది.

ఈ సినిమా హిందీ శాటిలైట్ హక్కులు స్టార్ గోల్డ్ వద్ద ఉండగా వారు ఈ చిత్రాన్ని రేపు మే 24 న గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కి తీసుకురాబోతున్నారు. అయితే ఇది సరైన సమయం అని చెప్పాలి. ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ తో జనాలు సాయంత్రం అయితే ఎంటర్టైన్మెంట్ కి అలవాటు పడిపోయారు.

ఇన్ని రోజులూ ప్రతి సాయంత్రం ఏదొక మ్యాచ్ ఉండేది. కానీ రేపు మాత్రం క్వాలిఫైర్ విరామం కావడంతో సరైన స్లాట్ ఈ చిత్రానికి దొరకడంతో మేకర్స్ రేపు సాయంత్రం ఇదే ఐపీఎల్ మ్యాచులు స్టార్ట్ అయ్యే సమయానికి అంటే 7 గంటల 30 నిమిషాలకే సలార్ ని ప్రసారం చేయబోతున్నారు. మరి హిందీలో ఈ భారీ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు