“సలార్ 2”.. పక్కా ప్లానింగ్ తో ముగింపుకి సమయం ఫిక్స్

“సలార్ 2”.. పక్కా ప్లానింగ్ తో ముగింపుకి సమయం ఫిక్స్

Published on May 4, 2024 3:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా ఇప్పుడు చేస్తున్న చేయనున్న భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో మొదలు పెట్టనున్న క్రేజీ సీక్వెల్ చిత్రం “సలార్ 2” (Salaar 2) కూడా ఒకటి. మరి సలార్ సీజ్ ఫైర్ కి కొనసాగింపుగా “సలార్ శౌర్యంగ పర్వం” (Salaar Shouryaanga Parvam) గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ రెండో భాగం ఈ మే నుంచే మొదలు పెట్టనున్నట్టుగా ఆల్రెడీ టాక్ ఉంది. ఇక మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ సినిమా విషయంలో ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరి వీటి ప్రకారం ప్రభాస్ సలార్ 2 సెట్స్ లో ఈ జూలై నుంచి అడుగు పెట్టనున్నాడట. అయితే ఇప్పుడు ప్రభాస్ లేని సీన్స్ ని తెరకెక్కించనుండగా ఆల్రెడీ తాను ఉన్న పార్ట్ 2 సీన్స్ ఎప్పుడో ఇది వరకే కొన్ని చేసేసారు. సో ఇప్పుడు తాను లేని సీన్స్ చేయనున్నారు.

ఇక దీనితో పాటుగా ఈ ఏడాది అక్టోబర్ నాటికి సినిమా మొత్తం షూట్ కి ఎండ్ కార్డు వేసేసేలా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా మొదలు పెట్టనున్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ సినిమా పూర్తయ్యి రిలీజ్ కావడానికి అంత సమయం తీసుకోకపోవచ్చనే చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే హోంబళే ఫిల్మ్స్ వారే నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు