షారుఖ్ “పఠాన్” సీక్వెల్ పై సాలిడ్ అప్డేట్

షారుఖ్ “పఠాన్” సీక్వెల్ పై సాలిడ్ అప్డేట్

Published on Feb 20, 2024 10:54 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకోణ్ హీరోయిన్ గా యాక్షన్ సినిమాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం “పఠాన్” కోసం అందరికీ తెలిసిందే. మరి బాలీవుడ్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చిన బిగ్గెస్ట్ హిట్ అయితే ఈ సినిమా తోనే వచ్చింది.

అలా అక్కడ నుంచి మళ్ళీ బాలీవుడ్ మార్కెట్ కూడా ఫామ్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారు తమ సినిమాటిక్ యూనివర్స్ ని కూడా పరిచయం చేయగా మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సెన్సేషనల్ హిట్ కి సీక్వెల్ ని మేకర్స్ అప్పుడే కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు దీనిపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

దీనితో ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది లాస్ట్ లో అయితే స్టార్ట్ చేయనున్నారట. మరి ఈ సినిమా కోసం మరింత క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఫస్ట్ పార్ట్ తో బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ కొట్టిన షారుఖ్ పార్ట్ 2 తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు