తారక్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై సాలిడ్ అప్డేట్.!

Published on Mar 15, 2021 1:00 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి అలాగే దీనితో తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమాను ప్లాన్ చేసారు. ఆల్రెడీ అది కన్ఫర్మ్ అయ్యింది, అయితే యంగ్ టైగర్ ఈ రెండు ఇంకా లైన్ లో ఉండగానే మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాను ఒప్పుకున్నారని టాక్ వచ్చింది.

ఎన్టీఆర్ మాస్ కాలిబర్ కు తగ్గ కథను నీల్ సిద్ధం చేసాడని తెలిసింది. దీనితో ఈ కాంబోపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా అది కాస్త దూరం అయ్యి అసలు ఉందా లేదా అన్న సంశయం మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.

తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్ లో ఈ మాస్ కాంబోపై క్లారిటీ ఇచ్చారు. దాదాపు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే ఉంటుంది అని దాన్ని రైట్ టైం లో అనౌన్స్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. సో ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండటం కన్ఫర్మ్ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :