“వార్ 2”.. హృతిక్, ఎన్టీఆర్ పై సాలిడ్ అప్డేట్స్ వైరల్

“వార్ 2”.. హృతిక్, ఎన్టీఆర్ పై సాలిడ్ అప్డేట్స్ వైరల్

Published on Mar 5, 2024 12:05 PM IST

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ల కలయికలో బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ ,ముఖర్జీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఫీస్ట్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి.

అయితే ఈ చిత్రంపై ఓ సాలిడ్ అప్డేట్ ఒకటి హృతిక్ కి సంబంధించి వైరల్ గా మారింది. అయితే దీని ప్రకారం ఈ మార్చ్ 7 నుంచి వార్ 2 లో హృతిక్ పై సన్నివేశాలు మేకర్స్ జపాన్ లో స్టార్ట్ చేస్తారట. జపాన్ లోని షావోలిన్ టెంపుల్ దగ్గర హృతి ఎంట్రీ సీన్స్ తెరకెక్కించనున్నారట.

అలాగే ఎన్టీఆర్ విషయానికి వస్తే తాను ఈ అవైటెడ్ చిత్రం షూట్ లో ఏప్రిల్ నుంచి జాయిన్ అవుతాడని తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ సెన్సేషనల్ మల్టీ స్టారర్ విషయంలో వచ్చిన ఈ టాక్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది. ఇక ఈ భారీ చిత్రానికి యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది ఆగస్ట్ రిలీజ్ కి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు