“సలార్”లో ప్రభాస్ లుక్స్ పై క్లారిటీ వచ్చినట్టేనా.?

Published on Mar 5, 2021 7:02 am IST

మన ఇండియాలోనే ఉన్న అతి తక్కువ మందికి హాలీవుడ్ లెవెల్ కటౌట్స్ ఉన్నాయి. అలాంటి వారిలో ప్రభాస్ పేరుని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అంచలంచెలుగా ఎదిగి ఇండియన్ సినిమాను రూల్ చేసే స్థాయికి ఇప్పుడు ప్రభాస్ చేరుకున్నాడు. మరి అందుకు తగ్గట్టుగానే తన ఎఫర్ట్స్ ను పెడుతూ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు రెండు భారీ ప్రాజెక్టులలో ఏకకాలంలో నటిస్తూ తన డెడికేషన్ ను చాటుకున్నాడు.

మరి ఈ రెంటిలో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ “సలార్” కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో మాత్రం ప్రభాస్ రెండు షేడ్స్ లో కనిపించడం ఖాయం అయ్యిపోయింది అని చెప్పాలి. గతంలో ఈ సినిమా అనౌన్స్ చేసినపుడు పోస్టర్ లో మంచి గుబురు మీసంతో క్లీన్ షేవ్ లో ఒక మధ్య వయసు కలిగిన పవర్ ఫుల్ నియంతలా కనిపించాడు.

మళ్ళీ ఆ తర్వాత షూట్ లో ట్రిమ్డ్ లుక్ లో యంగ్ షేడ్ కు వచ్చేసాడు. దీనితో అప్పట్లో కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది. కానీ లేటెస్ట్ గా “జాతి రత్నాలు” ట్రైలర్ లాంచ్ కు కనిపించి అన్ని క్లియర్ చేసేసాడు. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో మంచి వైరల్ అయ్యాయి. మొత్తానికి మాత్రం ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్టే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :