“టిల్లు స్క్వేర్” లో కొంచెం మ్యాజిక్ తగ్గిందా?

“టిల్లు స్క్వేర్” లో కొంచెం మ్యాజిక్ తగ్గిందా?

Published on Feb 15, 2024 12:02 PM IST


మన టాలీవుడ్ నుంచి రాబోతున్న మరో అవైటెడ్ సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యూత్ ఫుల్ క్రేజీ రైడ్ హిట్ చిత్రం “డీజే టిల్లు” కి సీక్వెల్ గా వస్తున్నా చిత్రం “టిల్లు స్క్వేర్” అనే చెప్పాలి. మరి ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ తెరకెక్కిస్తుండగా పోస్ట్ పోన్ అవుతున్నా కూడా ఈ సినిమాపై మాత్రం బజ్ తగ్గలేదు. అలా ఫైనల్ గా మేకర్స్ నిన్న ట్రైలర్ ని గ్రాండ్ గా రిలీజ్ చేశారు.

అయితే ఈ ట్రైలర్ కి యూనానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదని చెప్పాలి. గతంలో డీజే టిల్లు ట్రైలర్ కానీ ఆ సినిమాతో వచ్చిన హైప్ కి తగ్గ రేంజ్ లో అయితే స్క్వేర్ లేడని మూవీ లవర్స్ లో ఉన్న టాక్. రొమాన్స్ వరకు ఓకే కానీ టిల్లు పాత్రపై ఇంకాస్త ఎంటర్టైనింగ్ గా చూపిస్తే ట్రైలర్ మరింత క్రేజ్ వచ్చి ఉండేది. మరి కేవలం ట్రైలర్ మాత్రమే కాబట్టి సినిమాలో తప్పకుండా టిల్లు రోల్ నుంచి కావాల్సిన మార్క్ ఎంటర్టైన్మెంట్ తప్పకుండా ఉంటుందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు