
‘జులాయి’ లాంటి కమర్షియల్ హిట్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. విలువలే ఆస్తి అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ సినిమా సమ్మర్ లో వచ్చిన మొట్ట మొదటి పెద్ద సీజన్. అందుకే ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా సమ్మర్ సీజన్ కావడం వలన రికార్డ్ స్థాయి కలెక్షన్స్ నమోదయ్యాయి. మొదటి వారం రోజుల్లో 30 కోట్ల మార్క్ షేర్ ని క్రాస్ చెఇస్న ఈ సినిమా ఇంకా చాలా ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. నిన్నటితో 5 వారాలు కంప్లీట్ చేసుకుంది. మొత్తం 5 వారాల్లో ఈ సినిమా 50 కోట్ల మార్క్ షేర్ దగ్గరికి వచ్చి ఆగింది. ఓవరాల్ గా 50 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. మొదటి 5 వారల షేర్స్ వివరాలను మీకందిస్తున్నాం..
| ఏరియా | కలెక్షన్స్ |
| నైజాం : | 13.55 కోట్లు |
| సీడెడ్ : | 6.62 కోట్లు |
| వైజాగ్ : | 4.10 కోట్లు |
| తూర్పు గోదావరి : | 2.85 కోట్లు |
| పశ్చిమ గోదావరి : | 2.43 కోట్లు |
| కృష్ణా : | 2.50 కోట్లు |
| గుంటూరు : | 3.13 కోట్లు |
| కర్ణాటక : | 5.7 కోట్లు |
| రెస్ట్ అఫ్ ఇండియా : | 1.30 కోటి |
| ఓవర్సీస్ : | 6.20 కోట్లు |
| మొత్తం: | 49.83 కోట్లు |