మురుగదాస్ దర్శకత్వంలో సోనాక్షి సిన్హా యాక్షన్ ఫిల్మ్.

sonakshi-sinha
రజినీకాంత్ ‘లింగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి సోనాక్షి సిన్హా. ‘తుపాకీ’ హిందీ రీమేక్ ‘హాలిడే’లో సోనాక్షి సిన్హా నటనకు మంచి పేరొచ్చింది. ఎక్కువగా గ్రామీణ యువతి పాత్రలు చేస్తున్న ఈ బొద్దుగుమ్మను సిటీ గర్ల్ గా చూపించారు దర్శకుడు ఏఆర్ మురుగదాస్. ఇప్పుడు సోనాక్షి సిన్హాతో హిందీలో ఓ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి సోనాక్షి సిన్హా మాట్లాడుతూ… మురుగదాస్ దర్శకత్వంలో ఓ ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతున్నాను. ఇది యాక్షన్ మూవీ. స్టార్ హీరోల తరహాలో ఫైట్స్ కూడా చేస్తాను. దర్శకుడు సూచన మేరకు ఫైట్స్ లో శిక్షణ కూడా తీసుకున్నాను. నా యాక్టింగ్ లో మరో కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అని చెప్పింది. డిసెంబర్‌లో ఈ మూవీ సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Exit mobile version