ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను – సోనాక్షి సిన్హా

ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను – సోనాక్షి సిన్హా

Published on May 16, 2024 12:00 AM IST

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తాజాగా ‘హీరామండి’ అనే వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ లో సోనాక్షి సిన్హా నటనకు గాను ఆమెకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఈ క్రమంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన సినీ కెరీర్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోనాక్షి సిన్హా మాట్లాడుతూ..‘కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు వచ్చినా గుర్తింపు రాలేదు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. అప్పుడే నేను నా పాత్రలను ఎంచుకునే విధానాన్ని మార్చుకున్నాను.

సోనాక్షి సిన్హా ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చేసిన కమర్షియల్‌ చిత్రాలు ఎన్నోసార్లు నన్ను బాగా నిరాశపరిచాయి. ఐతే, నాకు వచ్చిన పాత్రకు 100 శాతం న్యాయం చేయాలనే కసితో నేను పనిచేసే దాన్ని. అలాగే, గుర్తింపు తెచ్చుకోవడానికి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తూ వచ్చాను కాబట్టే.. నేను ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నాను’ అని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు