సోనూ సూద్ ఏది చేసినా కొంచెం భిన్నంగానే ఉంటుంది. ముఖ్యంగా ఫిట్నెస్ విషయంలో ఆయన అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. వీలు దొరికినప్పుడల్లా శరీరానికి శ్రమ పెట్టి ఆరోగ్యం పొందుతుంటారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో జరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివల’ఆచార్య’ షూటింగ్లో పాల్గొంటున్నారు. కోకాపేటలో వేసిన సెట్స్ మీద హైవోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు టీమ్. అందులో సోనూ సూద్ కూడ పాల్గొనాల్సి ఉంది. మామూలుగా సిటీ నుండి కోకాపేటకు వెళ్లాలంటే సెలబ్రిటీలు కార్లలోనే వెళ్తారు. అందునా షూటింగ్ కోసం వెళ్తుంటే అస్సలు అలిసిపోకుండా చూసుకుంటారు.
కానీ సోనూ సూద్ మాత్రం సిటీలో తాను బస చేస్తున్న చోటు నుండి కోకాపేట షూటింగ్ లొకేషన్ వరకు సైకిల్ మీద వెళ్లారు. వర్షపు తుంపరలు పడుతుంటే తుడుచుకుంటూ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ వెళ్లారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందరూ ఫిట్నెస్ మీద సోనూ చూపిస్తున్న శ్రద్ధను అభినందిస్తున్నారు. ఇకపోతే ‘ఆచార్య’ చిత్రం మే 13న విడుదలకావాల్సి ఉండగా కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా వాయిదాపడేలా ఉంది.
