బాలీవుడ్ లో బిజీగా మారుతున్న సోనూ సూద్

sonu-sood

‘అరుంధతి’ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన సోనూసూద్ ఆ తరువాతనుండి ఇక వెనుదిరిగి చూడలేదు. హిందీలో ఈ విధమైన బ్రేక్ సోనూ సూద్ కి ‘దబాంగ్’ సినిమా ద్వారా లభించింది. తనకు దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మంచి పేరు సంపాదించుకుంటున్నాడు.

సోనూ ఇటీవలే మహేష్ బాబు ఆగడు, హిందీలో షారుక్ హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలలో మనకు కనిపించాడు. షారుఖ్ పుణ్యమా అని ఇప్పుడు బాలీవుడ్ లో మంచి ఆఫర్లను అందుకుంటున్నాడు. ఈ టాలెంటడ్ నటుడికి మంచి ఆఫర్లు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

Exit mobile version