త్వరలో అలవైకుఠపురంలో టీజర్, హైలైట్స్ ఏమిటంటే?

త్వరలో అలవైకుఠపురంలో టీజర్, హైలైట్స్ ఏమిటంటే?

Published on Nov 27, 2019 5:14 PM IST

Ala Vaikunthapuramulo1

వరుసగా మూడు పాటలు విడుదల చేసి ఫ్యాన్స్ ని ఫిదా చేసిన బన్నీ వారికి త్వరలో అతిపెద్ద గిఫ్ట్ సిద్ధం చేస్తున్నారు. అదేమిటంటే అలవైకుంఠపురంలో మూవీ టీజర్ కొద్దిరోజులలో విడుదల చేయనుందట చిత్ర బృందం. దీనికి కోసం త్రివిక్రమ్ అప్పుడే కసరత్తులు కూడా మొదలుపెట్టారట. నిమిషానికి అటూ ఇటుగా ఆకర్షణీయంగా టీజర్ కట్ చేయనున్నారట. మరో విశేషం ఏమిటంటే ఈ టీజర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్, బన్నీ పూజా ల రొమాన్స్ మరియు త్రివిక్రమ్ మార్కు కామెడీ పంచ్ లు హైలైట్ గా నిలువనున్నాయట. అన్ని అంశాలతో ఫుల్ ప్యాక్డ్ గా బన్నీ ఫ్యాన్స్ ఫిదా ఐయ్యేలా టీజర్ ఉంటుందని సమాచారం.

ఇక పూజ హెగ్డే మరో మారు బన్నీకి జంటగా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ టబు కీలక రోల్ చేస్తున్నారు. హీరో సుశాంత్, నివేద పేతురాజ్ ,మురళి శర్మ, రాజేంద్ర ప్రసాద్ వంటి నటులు కీలకపాత్రలలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం సమకూర్చుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు